నవతెలంగాణ – జుక్కల్
జాతీయ ఉపాదీహమీ పథకంలో భాగంగా గ్రామాలలో అర్హులైన కూలీలందరికి పనులను కల్పించి ఉపాదీ పొందెల చూడాలని జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం నాడు మండలంలోని మైబాపూర్ గ్రామాన్ని సందర్శించారని గ్రామ పంచాయతి కార్యదర్శి విజయ్ తెలిపారు. మెుదటగా గ్రామములో ఉపాదీ హమీ పనులు చేస్తున్న ప్రదేశంలో క్షేత్రస్థాయి సందర్శన చేసి కూలీలతో సమస్యలను అడిగి తెలుసు కున్నారు. కూలీ పనులు టూఏ లు ఇచ్చిన కలతల ప్రకారం చేస్తే రోజుకు ప్రభూత్వం నిర్ణయించిన ధర ప్రకారం కూలీ అందుతుందని సూచించారు. ఎండలు పెర్గుతుండటంతో వీలైనంత వరకు ఉదయం ఆరు గంటల లోపు పని ప్రదేశంలో ఉండాలని , ఎండ ఉన్నప్పుడు పనులను నిలిపి వేసి సేదతీరాలని కూలీలకు తెలిపారు. మండలంలోనే మైబాపూర్ రికార్డు స్థాయిలో మెండేస్ చేసి ప్రతి ఒక్కరికి పనులు కల్పించడమే కాకా కూలీలందరికి డబ్బులు కూడా వారీ బ్యాంకు జమా చేయడం జర్గిందని ఎఫ్ఏ, టీఏలను అభినందించారు. కష్టపడి పనులు చేయుస్తున్న గ్రామ స్థాయి అధికారులను గుర్తిస్తామని తెలిపారు. ఎంపిడివో తో పాటు జీపీ కార్యదర్శి విజయ్, ఎఫ్ఏ, టీఏ, కూలీలు తదితరులు ఉన్నారు.