ప్రతీ పంచాయితీలో గ్రామీణ ఉపాధి పథకంలో మొక్కలు పెంచడానికి నర్సరీలను సిద్దం చేయాలని ఎంపిడిఒ శ్రీనివాసరావు కార్యదర్శులకు సూచించారు. ఆయన బుధవారం పలు పంచాయితీలు ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కార్యదర్శులకు పలు సూచనలు చేసారు.విత్తనాలు నాటడానికి సంచుల్లో మట్టి, ఎరువు నింపడంతో పాటు తరుచూ నీటి తడులు ఇవ్వాలని ఆదేశించారు.సిద్దంగా ఉన్న బ్యాగ్ ల్లో విత్తనాలు నాటి బెడ్ లు ఏర్పాటు చేయాలని అన్నారు.