ప్రత్యేకాధికారిగా బాధ్యతలు స్వీకరించిన ఎంపిడిఒ శ్రీనివాసరావు..

నవతెలంగాణ – అశ్వారావుపేట

స్థానిక పాలక వర్గాల పదవీకాలం మంగళవారంతో ముగియడంతో తెలంగాణ ప్రభుత్వం పంచాయితీలకు ప్రత్యేకాధికారులు ను నియమించింది. ఎం.పి.డి.ఒ జి.శ్రీనివాసరావు కు కేటాయించిన వినాయకపురం,కొత్త మామిళ్ళ వారిగూడెం, ఊట్లపల్లి పంచాయితీల్లో బుధవారం బాధ్యతలు స్వీకరించారు. మండలంలోనే అత్యధిక జనాభా గల మూడో ఎస్.టి రిజర్వడ్ పంచాయితి వినాయకపురం కాగా, ఊట్లపల్లి ఎస్.సి రిజర్వడ్ పంచాయితీ,కొత్త మామిళ్ళ వారిగూడెం ఎస్.టి రిజర్వడ్ పంచాయితీ.ఈ మూడు పంచాయితీలు మహిళా సర్పంచ్ లే.అయితే వినాయకపురం, కొత్త మామిళ్ళ వారిగూడెం పంచాయితీ లలో సర్పంచ్ ల భర్త లే పరిపాలనా వ్యవహారాలు చక్కబెట్టే వారు.ఊట్లపల్లి పంచాయితీ సర్పంచ్ జ్యోత్స్న భాయి స్వయం నిర్ణయాలతో పాలన సాగించారు. ఈ కార్యక్రమాల్లో ఆయా సర్పంచ్ లు,కంప్యూటర్ ఆపరేటర్ లు, పంచాయితీ గుమాస్తా లు పాల్గొన్నారు.