
నాగర్ కర్నూలు జిల్లా కోడెరు మండల పరిషత్ కార్యాలయంలో పనిచేస్తున్న ఎంపీఓ శ్రవణ్ కుమార్ పై కోడేరు ఎంపీపీ దాడి చేయడాన్ని నిరసిస్తూ మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీడీఓ లక్షప్ప ఆధ్వర్యంలో సోమవారం కార్యాలయ సిబ్బంది నల్లబ్యాడ్జీలు దరించి నిరసన వ్యక్తం చేశారు.ప్రభుత్వ అధికారిపై దాడి చేసిన ఎంపీపీపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని సిబ్బంది డిమాండ్ చేశారు. ఎంపీఓ విష్ణు వర్ధన్,పంచాయితీ కార్యదర్శులు పాల్గొన్నారు.