సీఎం కప్ క్రీడా పోటీలు ప్రారంభించిన ఎంపీడీఓ..

MPDO has started the CM Cup sports competition.నవతెలంగాణ -పెద్దవూర
మండల కేంద్రంలోని జెడ్ పి హెచ్ ఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ముఖ్యమంత్రి క్రీడా పోటీలను ఎంపీడీవో ఉమాదేవి బుధవారం ఆటల పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ,గ్రామీణ క్రీడలను ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుందని, పేద విద్యార్థులు పాఠశాలలో క్రీడా ఉపాధ్యాయులతో నిత్యం క్రీడలను నేర్చుకోవడం వలన మండల స్థాయి నుండి డివిజన్ స్థాయి, జిల్లా జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొని మంచి భవిష్యత్తును పొందవచ్చు అని, దేశానికి మంచి పేరు తెచ్చే విధంగా ఆటల పోటీలలో పథకాలను సాధించి దేశం గర్వపడేలా యువతి యువకులు సన్మార్గంలో నడుచుకొని దేశం పేరు దేశదేశాలలో మారుమ్రేగేలా పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని ఆమె సూచించారు.ఈ కార్యక్రమంలో కబడి, వాలీబాల్, కోకో, వంటి ఆటల పోటీలను ప్రారంభించారు. క్రీడలలో గెలుపొందిన వారికి ప్రోత్సహకాలు ప్రభుత్వాలు అందిస్తాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో తహసీల్దార్ సరోజ పావని,ఎంఈఓ తరిరాము, ఆయా పాఠాశాలల ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.