
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక పారిశుద్ధ్య వార్షికోత్సవాలను విజయవంతం చేయాలని నసురుల్లాబాద్ ఎంపీడీవో సుబ్రహ్మణ్యం సూచించారు. మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో గ్రామ, ప్రత్యేక అధికారులు, కార్యదర్శిలతో పరిశుద్ధ వారోత్సవంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ రాజు, ఎంపీడీవో సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 7 నుంచి 14 వరకు ప్రత్యేక పారిశుద్ధ్య వారోత్సవాలను నిర్వహిస్తుందన్నారు. అందుకు గ్రామ కార్యదర్శి పనులను గుర్తించి, వాటిని ప్రత్యేక అధికారుల చొరవతో పనులను విజయవంతం చేయాలన్నారు. గ్రామంలో పారిశుధ్య పనులను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ గ్రామ ప్రత్యేక అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించే విధంగా గ్రామ కార్యదర్శి కృషి చేయాలన్నారు. నిర్వహిస్తున్న పారిశుద్ధ్య వారోత్సవాల్లో కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఉన్నతాధికారుల ఆకస్మిక తనిఖీలు ఉంటాయని ఆయన అన్నారు. అందుకు అనుగుణంగా గ్రామ కార్యదర్శి విధులు సక్రమంగా నిర్వహించాలని ఆయన సూచించారు. నిర్లక్ష్యం చేసిన వారిపై తగు చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఓ రాము, వివిధ గ్రామాల ప్రత్యేక అధికారులు,కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.