
రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకొని గ్రామాల్లో నీటి కొరత లేకుండా చూడాలని ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి, తహశీల్దార్ వీరంగటి మహేందర్ అన్నారు. శుక్రవారం పంచాయతీ ప్రత్యేక అధికారులతో వారు ఎంపీడీవో కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక అధికారులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు.పెండింగ్లో ఉన్న మల్టీపర్పస్ వర్కర్స్ వేతనాలు చెల్లింపు కోసం అధికారులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి సత్యనారాయణ, పీఆర్ ఏఈ దయాకర్, మిషన్ భగీరథ ఏఈ యాకుబ్ పాషా, ఇరిగేషన్ ఏఈఈ స్వాతి, లక్ష్మి, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, విజయకుమార్, కళాధర్, శేషవల్లి తదితరులు పాల్గొన్నారు.