నవతెలంగాణ – పెద్దవంగర
మహిళా శక్తి ప్రపంచానికే స్ఫూర్తిగా నిలుస్తుందని ఎంపీడీవో వేణు మాధవ్, ఐసీడీఎస్ సూపర్వైజర్ కవిత రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా హాజరై మహిళల హక్కులపై అవగాహన కల్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ..లింగ సమానత్వం తోనే సుస్థిరత ఏర్పడుతుందన్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు లింగ బేధం లేకుండా సమాజస్థాపన జరగాలని, చట్టాలు ఎన్ని ఉన్నా ఎవరికి వారు మార్పు చెంది పరిపక్వంగా ఆలోచించాలని సూచించారు. నేటి పోటీ ప్రపంచంలో పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారని, ఆడ పిల్లలుగా పుట్టినందుకు గర్వపడాలని అన్నారు. ప్రకృతితో, దేవతలతో స్ర్తీని పోలుస్తారు కాని సమానత్వం ఆలోచన ప్రతీ ఒక్కరికి కలగాలని, స్ర్తీని గౌరవించినప్పుడే మనుగడ, అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. మహిళా సాధికారత, మహిళా రక్షణ చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఐకేపీ సీసీ పద్మ, అంగన్వాడీ టీచర్స్ మంజుల, రేణుక, సరళ, అంబిక తదితరులు పాల్గొన్నారు.