నర్సరీలో మొక్కలను సంరక్షించాలి: ఎంపీడీవో వేణుమాధవ్

నవతెలంగాణ – పెద్దవంగర
నర్సరీలో మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో వేణుమాధవ్ అన్నారు. శనివారం మండలంలోని చిన్నవంగర, బావోజీ తండా లోని నర్సరీలను ఆయన సందర్శించారు. మొక్కలను పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం ఎంపీడీవో మాట్లాడుతూ..నర్సరీల ఏర్పాటు, మొక్కల పెరుగుదలకు వాడే నాణ్యమైన మట్టి రకాలు, విత్తనాలు, మొక్కల సంరక్షణ తదితర అంశాలపై దృష్టి సారించాలన్నారు. నర్సరీలోని ప్రతి మొక్కను కాపాడాలని అన్నారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు ఉన్నారు.