
మండలంలోని మహమ్మదాబాద్ గ్రామ పంచాయతి గ్రామాన్ని జుక్కల్ ఎంపీడీవో శ్రీనీవాస్ శుక్రవారం నాడు సందర్శించారని జీపీ కార్యదర్శి జీవన్ తెలిపారు. ఈ సంధర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. గ్రామములో మురికి కాలువలు శుభ్రం చేయాలని, దోమల బెడద లేకుండా చర్యలుః చేపట్టలని, సీజనల్ వ్యాదులు పట్ల అప్రమత్తంగా ఉండాలని గ్రామములోని సమస్యలను వెంట వెంటనే పరిష్కరించాలని జీపీ కార్యదర్శిని ఆదేశించారు. గ్రామములోని ఎంపియూపీఎస్ పాఠశాలను సందర్శించి మద్యహన బోజన పథకంలో వండిన వంటకాలను రూచి చూసి విద్యార్థులతో మాట్లాడారు. మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఉపాద్యాయులు సమయపాలన పాటీంచాలని సూచించారు. అనంతరం జీపీ సెక్రట్రి తో కలిసి గ్రామములోని ఉపాదీహమీ నర్సరీని సందర్శించారు. నర్సరీలోని పెంచుతున్న మెుక్కలను పరీశీలించారు. రాబోయే వనం మహోత్సవ కార్యక్రమాలకు మెుక్కలు సిద్దం చేసేల చర్యలు చేపట్టాలని సెక్రట్రికి సూచించారు.