పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన ఎంపీడీఓ..

MPDO conducted a surprise inspection of the school.నవతెలంగాణ – భీంగల్ రూరల్
ఈరోజు భీంగల్ మండల అభివృద్ధి అధికారి సంతోష్ కుమార్ మండలంలోని మెండోరా గ్రామ జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థుల హాజరు,సిలబస్ పూర్తి పై సమీక్ష,మధ్యాహ్న భోజనం,చదువుతున్న విద్యాభివృద్ధిని స్వయంగా పరిశీలించారు. వచ్చే పదవ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలని విద్యార్థులకు తెలియజేశారు. 100% ఫలితాలు సాధించేలా కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాలలోని తరగతి గదులు, వంటగది, స్టోర్ రూమ్, పరిశీలించారు. అనంతరం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు,బిఆర్ఎస్ నాయకులు, విడిసి సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయుల సమక్షంలో ఎంపీడీవో సంతోష్ కుమార్ కు ఉత్తమ ఎంపీడీవో అవార్డు పొందినందుకు సన్మానించారు.