కులగణన సర్వేలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు: ఎంపీడీఓ

Actions will be taken if caste census is neglected: MPDOనవతెలంగాణ – జుక్కల్

కులగణన సర్వేలు గ్రామాలలో నిర్వహిస్తున్న అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ అన్నారు. శనివారం నాడు మండలంలోని చిన్న ఏడికి గ్రామానికి క్షేత్రస్థాయిలో సర్వే పనులను  పరిశీలించడం జరిగింది.  ఈ సందర్భంగా ఎంపీడీవో పలు సర్వే చేస్తున్న అధికారులకు పలు సూచనలు చేయడం జరిగింది. గ్రామాలలో సర్వేలకు వెళ్లినప్పుడు గ్రామస్తులు ఇచ్చిన క్లుప్తమైన సమాచారం , తప్పులు దొర్లకుండా నమోదు చేయాలని, అదే విధంగా తాళాలు వేసి ఉన్న ఇండ్లను  గుర్తించి గృహ యజమానులు  ఎక్కడ ఉంటున్నారు  వివరాలు, గ్రామస్తులకు వీధిలో నివాసముంటున్న ఉన్న వారికి ఇంటి పక్కన ఉన్న వారిని అడిగి వివరాలు సేకరించి ఫోన్ ద్వారా తాళాలు వేసి ఉన్న ఇంటి యజమానులకు సమాచారం అందించాలని ఎంపీడీవో ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సర్వే అధికారులతో పాటు గ్రామ పంచాయతీ సెక్రెటరీ తదితరులు పాల్గొన్నారు.