మూసి పునరుజ్జీవం కోసం మూసి ప్రక్షాళనలో భాగంగా ఈ నెల 8 వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండలంలోని సంగెo సమీపంలోని మూసి త్రివేణి సంగమం వద్ద పాదయాత్ర చేయనున్న స్థలాన్ని , సభా స్థలిని మంగళవారం భువనగిరి పార్లమెంట్ సభ్యులు ఛామల కిరణ్ కుమార్ రెడ్డి, స్థానిక శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, నకిరేకల్ శాసన సభ్యులు వేముల వీరేశం, మిర్యాలగూడ శాసన సభ్యులు బత్తుల లక్ష్మరెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంత రావు, డిసిపి రాజేష్ చెంద్ర తో కలిసి పాద యాత్ర స్థలాన్ని, సభా స్థలిని పరిశీలించారు. పాదయాత్ర ప్రాంతంలో, సభాస్థలి వద్ద పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వీరారెడ్డి,బిసి వెల్ఫేర్ అధికారి యాదయ్య, చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్ రెడ్డి, ఎసిపి మధుసూదన్ రెడ్డి, నీటిపారుదల శాఖ అధికారి లావణ్య, రామన్నపేట సిఐ వెంకటేశ్వర్లు, స్థానిక ఎంపిడిఓ జితేందర్ రెడ్డి, స్థానిక తహశీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.