నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని మహమ్మదాబాద్ గ్రామపంచాయతీ నందు పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో గడ్డి మందు స్ప్రే బుదువారం రోజు చేయించడం జర్గిందని జీపీ కార్యదర్శి జీవన్ తెలిపారు. ఈ సంధర్భంగా జుక్కల్ ఎంపీవో రాము ఆకస్మీకంగా గ్రామ సందర్శనకు వచ్చారు. గ్రామములోని విధులను, మురికి కాలువలను పరీశీలించారు. గడ్డి మందును బుదువారం నాడు ఉదయం కూలీలలతో పిచకారీ చేసామని, ముళ్లపొదలను తొలగించడం జర్గిమందని జీపీ కార్యదర్శి జీవన్ ఎంపీవో రాము కు తెలిపారు.