చల్లూరు సర్పంచ్ ను సన్మానిస్తున్న ఎంపీపీ, పాలకమండలి సభ్యులు

నవతెలంగాణ – వీణవంక
మండలంలోని చల్లూరు గ్రామ సర్పంచ్ పోదిల జ్యోతిరమేష్ తో పాటు పాలకమండలి సభ్యులను మరి కొద్ది రోజుల్లో పదవికాలం ముగియనుండడంతో శనివారం గ్రామం పంచాయతీ ఆవరణలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీపీ ముసిపట్ల రేణుకతిరుపతిరెడ్డి మాట్లాడుతూ గ్రామ అభివృద్ధే లక్షంగా పని చేయడంతో ప్రజలకు సేవ చేయడం అదృష్టంగా భావించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సవితమల్లయ్య, జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్  వాల బాలకిషన్ రావు, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.