పీహెచ్ సీ సబ్ సెంటర్లను పరిశీలించిన ఎంపీపీ

నవతెలంగాణ – భువనగిరి రూరల్ 
భువనగిరి మండలంలోని వడపర్తి, హనుమాపురం, అనంతారం గ్రామాలలో పీహెచ్సీ సబ్ సెంటర్ లను భువనగిరి ఎంపీపీ నారాల నిర్మల వెంకటస్వామి యాదవ్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  గ్రామాలలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలలో నిల్వ ఉన్న చెత్త చెదారం వలన మురికినీరు నిల్వ ఉండడంతో దోమలు వ్యాపించి ప్రజలు వ్యాధుల బారిన పడే అవకాశం ఉందన్నారు. గ్రామాలలో ఎప్పటికప్పుడు రోడ్లను శుభ్రం చేసి,  బ్లీచింగ్ పౌడర్ వేయాలని గ్రామపంచాయతీ సిబ్బందికి సూచించారు. అంగన్వాడి కేంద్రాలను పరిశీలించి గర్భిణీలకు పౌష్టికాహారం అందించాలని అంగన్వాడీ సిబ్బందికి సూచించారు. ప్రతిరోజు పిహెచ్సి సబ్ సెంటర్లలో  ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు గ్రామస్తులకు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రైమరీ,  హై స్కూల్ అల ఉత్తీర్ణత పెంచుకోవడానికి విద్యార్థులు ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఉపాధ్యాయులు చెప్పిన విధంగా పరీక్షలకు ప్రిపేర్ కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయాగ్రామాల స్పెషలాఫీసర్లు, పంచాయతీ సెక్రెటరీలు, ఆశ వర్కర్లు, అంగన్వాడి సిబ్బంది, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.