
భువనగిరి మండలంలోని బొల్లెపల్లి గ్రామంలో ఎన్.ఆర్ఇజిఎస్ నిద్ర నుంచి పది లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు బుధవారం భువనగిరి ఎంపీపీ నారాల నిర్మల వెంకటస్వామి యాదవ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ సిసి రోడ్ నిర్మాణంలో నాణ్యత పాటించాలని, ఇలాంటి ఫిర్యాదులు రాకుండా చూడాలని పంచాయతీరాజ్ ఏఈకి సూచించారు. ఈ కార్యక్రమంలో బొల్లెపల్లి ఎంపీటీసీ చంద్రకళ వీరస్వామి గౌడ్, మాజీ సర్పంచ్ బుచ్చిరెడ్డి, పంచాయతీ ఏ ఈ ప్రసాద్, ప్రజలు పాల్గొన్నారు.