నవతెలంగాణ – రెంజల్
నేడు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభం కావడంతో, రెంజల్ మండలంలోని రెంజల్, దూపల్లి, కోనపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో ఎంపీపీ రజిని కిషోర్, ఎంపీడీవో హెచ్. శ్రీనివాస్, ఎంఈఓ గణేష్ రావు లు విద్యార్థులకు ఏక రూప దుస్తులను, ఉచిత పాఠ్య పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం నిరుపేద విద్యార్థుల చదువులకు కోట్ల రూపాయలను ఖర్చు చేస్తూ, పాఠశాలలలో మౌలిక సదుపాయాలను కల్పించి, నాణ్యమైన విద్యాబోధన అందిస్తున్నారని వారు పేర్కొన్నారు. నిరుపేద తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఆంజనేయులు, దు పల్లి ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయురాలు బి. .వెంకటలక్ష్మి, కూనేపల్లి ప్రధానోపాధ్యాయురాలు అనురాధ, పి ఆర్ టి ఓ మండల అధ్యక్షులు టి. సోమలింగం గౌడ్, దూపల్లి ఎంపీటీసీ మొనాభాయ్, ఏపీఎం చిన్నయ్య, మండల సమైక్య అధ్యక్షురాలు లక్ష్మి, పాఠశాలల లోని ఉపాధ్యాయులు, ఐకెపి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.