
మండలంలోని బాబుల్ గావ్, హాట్యా నాయక్ తండాలో ఎంపీపీ ప్రతాప్ రెడ్డి పర్యటించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఈ గ్రామం జుక్కల్ మండలంలోనే ఉండేదని కానీ మండలాల విభజన తర్వాత ఈ గ్రామ ప్రజలు సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల్ లోకి వెళ్లడంతో ఒక జిల్లా మారి మరొక జిల్లాకు వెళ్లడం వల్ల అధికారులు సహకారం సరిగ్గా లేకపోవడంతో తిరిగి కామారెడ్డి జిల్లా పెద్ద కొడపగల్ మండలంలోనే మమ్మల్ని కలపండి అని జుక్కల్ శాసనసభ్యులు హన్మంత్ షిండే ను గతంలో వారి వద్దకు వచ్చి తమ గోడును ఎమ్మెల్యే దృష్టి కి తీసుకెళ్లారు. దింతో ఆయన సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి బాబుల్ గావ్ గ్రామా పంచాయతీని పెద్ద కొడపగల్ మండలంలోకి చేర్చిలని దింతో వీరికి కావాల్సిన అభివృద్ధి పనులు చేయాలని ఉద్దేశంతోటి ఈ గ్రామాన్ని సందర్శించడం జరిగిందని గ్రామంలో కానీ తండాలో కానీ ఎటువంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకెళ్తే కచ్చితంగా ఆ సమస్యను సకాలంలో పరిష్కరిస్తామని తాండావాసులకు గ్రామస్తులకు ఎంపీపీ భరోసాను ఇచ్చారు. మీ గ్రామనికి అన్ని రకాల అభివృద్ధి లో తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాబూల్ గ్రామస్తులు తాండవాసులు పాల్గొన్నారు.