తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఎంపీపీ నిరసన

– కుల ధ్రువీకరణ పత్రాల విషయంలో ఆలస్యం చేస్తున్నారని ఆరోపణ
నవతెలంగాణ-పినపాక
ఉన్నత ఉద్యోగాలకు, చదువుకులు వెళ్లే విద్యార్థుల విషయంలో విద్యార్థులకు కుల ధ్రువీకరణ పత్రాలు ఆదాయ నివాస ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడంలో తహసీల్దార్‌ జాప్యం చేస్తున్నారని ఎంపీపీ గుమ్మడి గాంధీ ఆరోపించారు. శనివారం తహసీల్దార్‌ కార్యాలయం ముందు నిరసన తెలయజేశారు. విద్యార్థులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. అనంతరం కార్యాలయంలో ఎంపీపీ మాట్లాడారు. గిరిజన విద్యార్థులకు సైతం క్రిస్టియన్‌ మతంలో ఉన్నారని దర్యాప్తు చేస్తున్నామని ఈ వంకతో ఆలస్యం చేస్తున్నారని తెలిపారు. తహసీల్దార్‌ వ్యవహారంపై ఉన్న అధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.