
మహబూబాబాద్ జిల్లా కొత్త కలెక్టర్ గా ఇటీవల పదవీ బాధ్యతలు చేపట్టిన అద్వైత్ కుమార్ సింగ్ ను మంగళవారం పెద్దవంగర ఎంపీపీ ఈదురు రాజేశ్వరి ఐలయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీపీ జిల్లా కలెక్టర్కు పూల మొక్క అందజేసి సన్మానించారు. ఆమె తో పాటు కలెక్టర్ ను కలిసిన వారిలో నెల్లికుదురు, గూడూరు ఎంపీపీలు ఎర్రబెల్లి మాధవి, సుజాత ఉన్నారు.