
నవతెలంగాణ- నవీపేట్: ప్రభుత్వ ఆసుపత్రి భూమిని భూకబ్జాల నుండి కాపాడాలని ఎంపీపీ సంగెం శ్రీనివాస్ అన్నారు. మండల కేంద్రంలోని క్లస్టర్ ఆరోగ్య కేంద్రంలో ఆసుపత్రి డెవలప్మెంట్ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ సంగెం శ్రీనివాస్ మాట్లాడుతూ ఆసుపత్రి భూమిని భూ కబ్జాదారుల నుండి కాపాడాలని అందుకు గ్రామ అభివృద్ధి కమిటీల సహకారంతో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి కంచే వేసేందుకు నిధులను మంజూరు చేసుకుందామని సూచించారు. ఆసుపత్రి అభివృద్ధి నిధులు కంచె నిర్మాణానికి ఖర్చు చేస్తే ఆసుపత్రిలో మౌలిక వసతుల కల్పనకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అందుకే ఎమ్మెల్యే ద్వారా ప్రత్యేక నిధుల కేటాయింపుకు కృషి చేద్దామని అన్నారు. అలాగే స్టాప్ నర్సుల కొరత సైతం ఉందని జిల్లా పరిషత్ సమావేశంలో ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. అనంతరం రోగులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ అంజన, మలేరియా జిల్లా అధికారి తుకారం నాయక్, ఎంపిటిసి మీనా నవీన్ రాజ్ సతీష్, వైద్యులు కావ్య, కిషన్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.