ఉత్తమ ఫలితాలు సాధించాలి: ఎంపీపీ

నవతెలంగాణ – అశ్వారావుపేట
పదో తరగతి విద్యార్థులు 10 కి 10 జీ.పీ.ఏ తో ఉత్తమ ఫలితాలు సాధించాలని అశ్వారావుపేట ఎంపీపీ అద్యక్షులు జల్లిపల్లి శ్రీరామమూర్తి ఆకాంక్షించారు. బుధవారం స్థానికి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, బాలికోన్నత పాఠశాలల పదో తరగతి విద్యార్థులు వీడ్కోలు సమావేశానికి ఆయన ముఖ్య అతిధి గా హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయుల సూచనలను పాటిస్తూ సత్ఫలితాలు సాధించి గ్రామానికి,పాఠశాలకు, గురువులకు మంచి పేరు తీసుకురావాలని సమాజంలో ఉన్నతంగా నిలవాలని ఆశాభావం వ్యక్తం చేసారు. కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సీహెచ్ వెంకయ్య,పీ హరిత, సీఆర్పీ ప్రభాకరాచార్యులు, ఉపాధ్యాయులు నరసింహరావు, బాలస్వామి, కొండలరావు, విద్యార్థులు, తల్లితండ్రులు పాల్గొన్నారు.