ఉత్తమ ఉద్యోగులను,సర్పంచ్ లను సన్మానించిన ఎంపీపీ శ్రీరామమూర్తి 

నవతెలంగాణ – అశ్వారావుపేట
సర్పంచ్ లను,ఉత్తమ ఉద్యోగులను ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి మండల పరిషత్ సమావేశ ప్రాంగణంలో మంగళవారం సన్మానించారు. ఫిబ్రవరి ఒకటి నుండి స్థానిక సర్పంచ్ ల పాలన కాలం ముగియనుంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మండలం నుండి పలు శాఖలకు చెందిన అధికారులను 16 మంది ని ఉత్తమ ఉద్యోగులుగా ఎంపికయ్యారు. ఈ క్రమంలో వీరి అందరిని ఎంపీపీ శ్రీరామ మూర్తి సన్మానించారు. ఇందులో 21 సర్పంచ్ లు,13 మంది ఉద్యోగులు హాజరు అవగా వారందరిని శాలువా కప్పి,జ్ఞాపిక తో శ్రీరామమూర్తి అభినందించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాసరావు,తహశీల్దార్ క్రిష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.