బొమ్మలరామారం మండలంలోని సోమాజిపల్లి ప్రాథమిక పాఠశాలలో పెరికల ఆదినారాయణ జ్ఞాపకార్థంగా వారి కుమారుడు పెరికల అరుణ్ కుమార్ సుమారు 1 లక్ష రూపాయల పైన వెచ్చించి వంటశాల గదిని నిర్మించటం జరిగింది. గతంలో వీరు మండలంలో అన్ని పాఠశాలలకు శానిటైజర్, స్టాండ్స్, క్యారం బోర్డ్స్ అందించారు. ఈ సందర్బంగా వారికి విద్యాశాఖ తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుధీర్ రెడ్డి,మండల విద్యాధికారి కృష్ణ , కాంప్లెక్స్ HM నాగార్జున, మాజీ ఉపసర్పంచ్ చందర్ నాయక్, ఉపాధ్యాయులు ప్రదీప్ కన్నా, వర్లు, పద్మ, గ్రామస్తులు పాల్గొన్నారు.