
తెలంగాణ వన మహోత్సవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని ఎంపీపీ ఎర్ర సబిత వెంకన్న, జెడ్పీటీసీ శ్రీరామ్ జ్యోతిర్మయి సుధీర్, ఎంపీడీవో వేణుమాధవ్ అన్నారు. సోమవారం మండలంలోని చిన్నవంగర గ్రామంలో నిర్వహించిన తెలంగాణ వన మహోత్సవ కార్యక్రమంలో వారు పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ.. మొక్కల తోనే మానవ మనుగడ సాధ్యమని, ప్రతి ఒక్కరు మొక్కలు నాటి, వాటి సంరక్షణ బాధ్యతలు చేపట్టాలని సూచించారు. ఆయా గ్రామాల్లో నిర్వహించిన తెలంగాణ వన మహోత్సవ కార్యక్రమంలో పలువురు మొక్కలు నాటారు. కార్యక్రమంలో కేజీబీవీ ప్రత్యేకాధికారి గంగారపు స్రవంతి, నాయకులు జలగం శేఖర్, జలగం వెంకటయ్య, పంచాయతీ కార్యదర్శి గీతా, టీఏ యాకయ్య, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.