ఘనంగా ఎంపీపీ జన్మదిన వేడుకలు

నవతెలంగాణ-పెద్దకొడప్ గల్
పెద్ద కొడంగల్ మండల ఎంపీపీ ప్రతాప్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు స్థానిక ఎస్సై కోన రెడ్డి ఎంపీపీకి కేక్ కట్ చేయించి శాలువాతో సన్మానించారు. సొసైటీలో చైర్మన్ హనుమంత్ రెడ్డి, శ్రీనివాస మెడికల్ లో డాక్టర్ నారాయణ, ప్రెస్ క్లబ్ సభ్యులు,వడ్లం గ్రామస్తులు,అంజనీగ్రామస్తులు,ఎంపీపీ జన్మదిన వేడుకలను నిర్వహించారు.అనంతరం స్వీట్లు పంచి  తినిపించారు అదేవిధంగా ఎంపీపీ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని దేవుడు ఆయనకు ఆయుర్ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అదే విధంగా మండల ప్రజలకు ఆయన ఎల్లవేళలా ప్రజా సేవలు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎస్సై కోనారెడ్డి, సర్పంచ్ తిరుమలరెడ్డి,సొసైటీ చైర్మన్ హనుమంత్ రెడ్డి,ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ ఉదయ్ కుమార్, సొసైటీ డైరెక్టర్ సాయ గౌడ్,యూత్ మండల్ ప్రెసిడెంట్ చిప్ప రమేష్, ప్రేమ్ సింగ్, పాత్రికేయులు రాజేందర్,పండరి గౌడ్, పర్వయ్య, రియాజుద్దీన్,రూప్ సింగ్,రమేష్,తదితరులు పాల్గొన్నారు.