ఎంపీలు పార్లమెంటులో వర్గీకరణపై నోరు విప్పాలి.

– ఎం ఆర్ పి ఎస్, ఎంఎస్పి ములుగు జిల్లా ఇన్చార్జి గుగ్గిళ్ళ పీరయ్య 
నవతెలంగాణ-గోవిందరావుపేట
కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వర్గీకరణ పై పార్లమెంటు సమావేశాలు నోరు విప్పాలని ఎమ్మార్పీఎస్ మరియు ఎం ఎస్ పీ ములుగు జిల్లా ఇన్చార్జి గుగ్గిళ్ళ వీరయ్య అన్నారు. మండలం లోని చల్వాయి గ్రామంలో ములుగు నియోజకవర్గ శాసనసభ సభ్యురాలు దనసరి సీతక్క కి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా  గుగ్గిళ్ళ పరయ్య మాదిగ మాట్లాడుతూ ఈనెల 18 నుండి 22వ తేదీ వరకు జరగబోవు అత్యవసర పార్లమెంటు సమావేశాల్లో షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ సమస్యను కాంగ్రెస్ పార్టీ ఎంపీలు నోరు విప్పి ఉషా మెహర్రా కమిషన్ రిపోర్ట్ కు చట్టబద్ధత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల డిక్లరేషన్ను స్వాగతిస్తూనే 20 ఏళ్లు అధికారంలో ఉన్న వర్గీకరణ అంశాన్ని ఏమాత్రం పట్టించుకోని కాంగ్రెస్ పార్టీపై అనేక అనుమానాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఎం ఆర్ పి ఎస్ ఎంఎస్పి ములుగు జిల్లా అనుబంధ సంఘాల సమన్వయకర్త నెమలి నరసయ్య మాదిగ.ములుగు జిల్లా మాదిగ మహిళా సమైక్య జిల్లా ఇన్చార్జి వావిలాల స్వామి మాదిగ. ఎం ఆర్ పి ఎస్ ములుగు జిల్లా కన్వీనర్ పుల్లూరి కర్ణాకర్ మాదిగ.మాదిగ కళా మండలి ములుగు జిల్లా ఇన్చార్జి కళ్ళే పెళ్లి రమేష్ మాదిగ.మాదిగ భవన నిర్మాణ కార్మిక సమాఖ్య జిల్లా ఇన్చార్జి ఏం పెళ్లి మల్లేష్ మాదిగ. ఏటూర్ నాగారం ఎమ్మార్పీఎస్ మండల ఇన్చార్జి కర్నే గోపి మాదిగ.పడిదల సతీష్ మాదిగ. మంగపేట ఎం ఆర్ పి ఎస్ మండల కోఆర్డినేటర్ చాపల సతీష్ మాదిగ.ఎమ్మార్పీఎస్ గోవిందరావుపేట గ్రామ అధ్యక్షులు జంగిడి ప్రకాష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.