ఎంపిటిసి సన్మానం

నవతెలంగాణ – మాక్లూర్ 
మండల కేంద్రంలోని 1వ ఎంపిటిసి సాయినేని వెంకటేశ్వర్ రావు కు గ్రామ కమిటీ, కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో ఎంపిటిసి పదవి ముగుస్తున్న సందర్భంగా సన్మాన కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు సలువాతో స్నంనించి, ఆయన గ్రామానికి చేసిన సేవలను గుర్తించారు. ఆయన మరిన్ని పదవులు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రవి ప్రకాష్, మాజీ సర్పంచ్ రాజు, మైనార్టీ నాయకులు అలిమ్, కాంగ్రెస్ నాయకులు జైల్ సింగ్, రామ గౌడ్, ఆరిఫ్, రవి గౌడ్, అనిల్, ఉరడి సందీప్, రాజ్ మల్లయ్య, విడిసి అద్యక్షులు నరేందర్, లక్ష్మన్, పట్నం సాయిలు, లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.