నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రామంలో జిల్లా మండల పరిషత్ పాఠశాలల బాల బాలికలకు దివీస్ ఆధ్వర్యంలో గురువారం డాక్టర్ జయంతి కుమార్ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దండు మల్కాపురం ఎంపిటిసి చిట్టెంపల్లి శ్రీనివాసరావు సర్పంచ్ ఎలువర్తి యాదగిరి మాట్లాడుతూ విద్యాభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్న దివీస్ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.అవకాశాన్ని వినియోగించుకొని విద్యార్థులు ఉన్నతులుగా ఎదగాలని ఆశాభావం వ్యక్తం చేశారు.అనంతరం 336 మంది బాలబాలికలకు బ్యాగులు పాదరక్షలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మల్కాజ్గిరి కృష్ణ ఎస్ఎంసి చైర్మన్ సిహెచ్ జంగయ్య పాఠశాల ప్రధానోపధ్యాయులు పి.నరసింహ రెడ్డి, శ్రీనివాస్ దివీస్ సిఎస్ఆర్ ఇంచార్జ్ వల్లూరి వెంకటరాజు, సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు