కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎంపీటీసీ ఇందూరి సత్యమ్మ..

– షాద్నగర్ల్ లో కాంగ్రెస్ దే విజయం
– షాద్నగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీర్లపల్లి శంకర్
నవతెలంగాణ -కొత్తూరు
రానున్న అసెంబ్లీ ఎన్నికలలో షాద్నగర్ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధిస్తుందని షాద్నగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని ఫాతిమాపూర్, కొత్తూరు తండా లలో పర్యటించారు. ఈ సందర్భంగా కొత్తూరు ఎంపీటీసీ ఇందూరు సత్యమ్మ తోపాటు పలువురు భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరందరికీ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి వారికి పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గొంగల్లా హరినాథ్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ జాండగూడెం సుదర్శన్ గౌడ్, క్రాంతి రెడ్డి, ఇందూరి శ్రీనివాస్, వీరమోని దేవేందర్ ముదిరాజ్, సర్పంచ్ అంబటి ప్రభాకర్, నవీన్ చారి, జెనిగే జగన్, వసుప్పుల మహేందర్, కుమారస్వామి గౌడ్, కొమ్ము కృష్ణ తదితరులు పాల్గొన్నారు.