
విద్యార్థుల్లేక ప్రభుత్వ పాఠశాలలు మూసివేసే ప్రమాదం పొంచి ఉందని విద్యార్థులను చేర్పించి పాఠశాలలను కాపాడుకోవాల్సిన బాధ్యత గ్రామస్తులందరిపైన ఉందని ఎంపీటీసీ కొలిపాక రాజు సూచించారు.గురువారం మండల పరిధిలోని దాచారం గ్రామంలో పంచాయితీ కార్యదర్శి సురేశ్ అధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు.గ్రామంలో వీధి లైట్లు,పారిశుద్ధ్యం,వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల,గర్భిణీలకు పౌష్టికాహారం పంపిణీ,రేషన్ బియ్యం సమస్యలను ఎంపీటీసీ గ్రామ సభలో అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.గ్రామస్తులు హజరయ్యారు.
మాజీ వార్డ్ సభ్యురాలి మృతికి నివాళులు : ఇటీవల పదవికాలం ముగిసిన మాజీ వార్డ్ సభ్యురాలు గణపురం నర్మద మృతి చెందడంపై గ్రామ సభలో ఎంపీటీసీ కొలిపాక రాజు,గ్రామస్తులు నివాళులర్పించారు.