శాశ్వత పోలియో నిర్మూలన కార్యక్రమం ప్రారంభించిన ఎంపీటీసీ

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం, పంతంగి, నేలపట్ల ఆదివారం ఎంపీటీసీలు చిట్టంపల్లి శ్రీనివాసరావు బోయ ఇందిరసంజీవ తడక పారిజాతమోహన్ నేత ఆయా గ్రామాలలో పోలియో చుక్కలు వేశారు. ముఖ్యఅతిథిగా పాల్గొని చిన్నారులకు వారి చేతుల మీదుగా పోలియో చుక్కలు వేయడం జరిగినది. పోలియో చుక్కలు వేయిద్దాం-పోలియో రహిత సమాజాన్ని స్థాపిద్దాం.. రెండు చుక్కలు వేయించండి పోలియోపై విజయం సాధించండి. ఇది ఓ బిడ్డ అంగవైకల్యాన్ని ఎదుర్కొనే ఏకైక మార్గంగా సూచించారు. 0-5 సంవత్సరాల లోపు పిల్లలకు తప్పకుండా పోలియోను వేయించండి అని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్పెషలాఫీసర్ మండల వ్యవసాయ అధికారి ముత్యాల నాగరాజు పంచాయతీ కార్యదర్శి చింతల శ్రీకాంత్ డాక్టర్ జ్యోతి,ఏఎన్ఎం దేవిక ఆశ వర్కర్లు సుజాత,తిరుమల,లలిత అంగన్వాడీ టీచర్స్ శోభ,శిరీష రమాదేవి,జయమ్మ పాల్గొన్నారు.