సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన ఎంపీటీసీ

నవతెలంగాణ – మాక్లూర్
మండలంలోని మదన్ పల్లి గ్రామంలోని ఒడ్డెర కాలనీలో సీసీ రోడ్డు పనులకు స్థానిక ఎంపీటీసీ గొవురి ఒడన్న గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా రూ. నాలుగు లక్షల నిధులతో సీసీ రోడ్డు, డ్రైనేజ్ నిర్మాణ పనులను కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి మహేష్, మాజీ ఎంపిటిసి స్వామి, హన్మండ్లు, జి. లింగన్న, గంగాధర్, లచన్న, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.