పారిశుద్ధ్య వారోత్సవాలు ముగింపు: ఎంపీటీసీ తడక పారిజాతమోహన్

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ మండలం నేలపట్ల,కుంట్లగూడెం గ్రామాలలో  పారిశుద్ధ్య వారోత్సవాల ముగింపు కార్యక్రమం గురువారం ఎంపీటీసీ తడక పారిజాతమోహన్ నేత నిర్వహించారు.తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పారిశుద్ధ్య వారోత్సవాల కార్యక్రమం సందర్భంగా నేలపట్ల,కుంట్లగూడెం గ్రామాలలో రోడ్లు,మురికి కాలువలు పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి శుభ్రం చేయించారు.అనంతరం నేలపట్ల గ్రామ రచ్చబండ వద్ద గ్రామ సభ నిర్వహించి పారిశుద్ధ్య కార్మికులను ఎంపీటీసీ తడక పారిజాతమోహన్ నేత ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ చౌట వేణు గోపాల్ గౌడ్ గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారులు ఏ.శ్రవణ్ కుమార్ బి.పృథ్వీరాజ్ పంచాయతీ కార్యదర్శులు ఏ.బ్రహ్మని యు.కిరణ్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు