
ధర్మసాగర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గా అవకాశం ఇస్తే గ్రామ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని ఎంపీటీసీ రోండి రాజు యాదవ్ అన్నారు. పది సంవత్సరాల తెలంగాణ అవతార అవతరణ దినోత్సవం సందర్భంగా ఆయన మండల కేంద్రంలో శనివారం నవ తెలంగాణ పత్రిక విలేకరితో ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడారు. నేను దాదాపు 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవలు చేస్తూ పార్టీ అభ్యర్థిగా గ్రామపంచాయతీ వార్డు సభ్యులుగా, ప్రస్తుత ఎంపీటీసీ సభ్యునిగా కొనసాగిస్తున్నానని తెలిపారు. ఇప్పటివరకు ధర్మసాగర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్లుగా కులం ప్రాథమికన దాదాపు అన్ని కులాల వారు సర్పంచిగా సేవలందించారని ఆరోపించారు.ముఖ్యంగా గ్రామంలో నిలుకొని ఉన్న పారిశుధ్యం, డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణం, మంచినీటి సౌకర్యాన్ని సమగ్రంగా నిర్వహించేందుకు నా శయశక్తుల కృషి చేస్తానని అన్నారు. ఇప్పటివరకు అభివృద్ధికి నేర్చుకొని మోడల్ కాలనీ, బీసీ కాలనీలోని సమస్యలను పరిష్కరించేందుకు మొదటి ప్రాముఖ్యతను ఇచ్చి అభివృద్ధి చేస్తానని ఆశా భావాన్ని వ్యక్తం చేశారు.ఇప్పటివరకు మా యాదవ కులానికి సర్పంచ్ గా అవకాశం రాలేదని,గ్రామ ప్రజలు సమాలోచనచేసి నాకు ఈ అవకాశాన్ని ఇస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఒక సామాన్య నిరుపేద యాదవ సామాజిక వర్గం నుండి వచ్చిన నాకు గ్రామ మేధావులు, విద్యావంతులు, నేతలు యువతి యువకులు నాకు ఈ అవకాశం ఇస్తారని ఆశిస్తున్నాను. గ్రామపంచాయతీ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ తరఫున హేమాహేమీలకు చాలా సార్లు అవకాశం ఇచ్చినప్పటికీ వారు గెలుపొందకపోవడంతో నాకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాపట్ల నమ్మకముతో అవకాశం ఇవ్వడానికి ముగ్గు చూపుతున్నారని ఈ సందర్భంగా తెలిపారు.