”మిస్టర్ బచ్చన్’ మ్యూజిక్‌కి ఇంత మంచి రెస్పాన్స్ రావడం చాలా హ్యాపీగా ఉంది. సాంగ్స్ అన్ని ప్రేక్షకులకు చాలా బాగా నచ్చాయి. ఇదొక సర్‌ప్రైజ్ (నవ్వుతూ)’ అని అంటున్నారు సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్. రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి.విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ నేపథ్యంలో మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు. ‘నేను మాస్, క్లాస్ అని అలోచించను. సాంగ్స్ అనేవి స్క్రిప్ట్ ప్రకారమే వస్తాయి. ఇందులో ఇలాంటి మాస్ సాంగ్స్ చేసే అవకాశం వచ్చింది. ఇందులో క్కువ హిందీ సాంగ్స్ ఉన్నాయి. ఇది మొత్తం డైరెక్టర్ ఐడియా. కిషోర్ కుమార్‌కి హరీష్ బిగ్ ఫ్యాన్. నేను కూడా ఆ సాంగ్స్ విని పెరిగాను. అయితే ఆ పాటలన్నిటికి కొత్త బీట్స్, బ్యాకింగ్ యాడ్ చేసి కొంచెం యాంప్లిఫై చేశాం. ఈ ఆల్బం కోసం హరీష్ సియాటిల్ వచ్చారు. అప్పటివరకూ నేను ఎప్పుడూ మ్యూజిక్ సిట్టింగ్స్‌లో కూర్చోలేదు. నాలుగు రోజుల్లో ట్యూన్స్ పూర్తి చేశాం. హరీష్ కి గ్రేట్ మ్యూజిక్ సెన్స్ ఉంది. మ్యూజిక్ సెన్స్ ఉన్న దర్శకులతో పని చేయడం కంపోజర్‌కి ఈజీగా ఉంటుంది. రవితేజ ‘కిక్’ సినిమా నేను చేయాల్సింది. అయితే కొన్ని కారణాల వలన అది కుదరలేదు. ఇప్పుడు ఈ సినిమాకి మ్యూజిక్ చేయడం పర్‌ఫెక్ట్ టైమింగ్ అనిపించింది. అంతేకాదు నా కెరీర్‌లో ఇదొక న్యూ చాప్టర్ కూడా’.