‘మిస్టర్ సెలెబ్రిటీ’ చిత్రంతో పరుచూరి వెంకటేశ్వర రావు మనవడు పరుచూరి సుదర్శన్ హీరోగా పరిచయం కాబోతున్నారు. ఆర్‌పి సినిమాస్ బ్యానర్ మీద చందిన రవి కిషోర్ దర్శకత్వంలో చిన్న రెడ్డయ్య, ఎన్. పాండు రంగారావు నిర్మించారు. ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్, శ్రీ దీక్ష, నాజర్, రఘుబాబు తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన టీజర్, పాటలు ఇలా అన్నీ కూడా ఆడియెన్స్‌లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను రానా దగ్గుబాటి విడుదల చేశారు. ట్రైలర్ విడుదల చేసిన రానా చిత్ర యూనిట్‌కి అభినందనలు తెలియజేశారు. ఇక ఈ మూవీ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో రాబోతోంది అని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది.ఈ ట్రైలర్‌లో హీరో యాక్షన్, వినోద్ ఆర్‌ఆర్, శివకుమార్ కెమెరా వర్క్ హైలెట్ అయ్యాయి. ఇక విలన్ ఎవరన్నది చూపించకుండా ట్రైలర్‌ను కట్ చేసిన విధానం దర్శకుని ప్రతిభను కనబరుస్తుంది. ఆ పాయింట్‌తో సినిమా మీద అందరిలోనూ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు. ఈనెల 4న భారీ ఎత్తున ఈ చిత్రం థియేటర్లోకి రానుంది. ఈ చిత్రానికి కెమెరామెన్ – శివ కుమార్ దేవరకొండ, సంగీతం – వినోద్ యజమాన్య, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – వెంకట్ రెడ్డి, ఎడిటర్ – శివ శర్వాణి.