సుదర్శన్ పరుచూరి హీరోగా ‘మిస్టర్ సెలబ్రిటీ’ అనే సినిమాను ఎన్. పాండురంగారావు, చిన్న రెడ్డయ్య సంయుక్తంగా ఆర్‌పి సినిమాస్ బ్యానర్ మీద నిర్మిస్తు న్నారు. ఈ మూవీకి చందిన రవి కిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్, శ్రీ దీక్ష, నాజర్, రఘుబాబు తదితరులు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. సోమవారం ఈ చిత్ర టీజర్ ఈవెంట్ లాంచ్ ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ‘నేను, మా తమ్ముడు కలిసి ఈ సినిమాను చూశాం. మా తమ్ముడు చాలా మంచి విమర్శకుడు. సుదర్శన్ బాగున్నాడని, సినిమా బాగుందని మెచ్చుకున్నారు. హీరోల కొడుకులు హీరోలు అవుతుంటారు. కానీ మా మనవడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. సెలబ్రిటీల మీద బయట వచ్చే రూమర్లను బేస్ చేసుకుని ఈ కథను రాసుకున్న దర్శకుడు రవి కిషోర్ సినిమాను బాగా తీశారు. రఘు బాబు తెరపై అద్భుతంగా నవ్విస్తాడు. సాయి మాధవ్ బుర్రా చాలా మంచి రచయిత. ఆడియెన్స్ కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్‌తో తీసిన ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలి’ అని అన్నారు.
‘నేను హీరో అవుతానని చెప్పగానే మా తాతయ్య నాకు కొన్ని పరీక్షలు పెట్టారు. ఎవ్వరికీ నా గురించి చెప్పకుండా జూనియర్ ఆర్టిస్ట్‌గా పని చేశాను. సినిమా కష్టాలన్నీ దగ్గరగా చూశాను. ఈ కథ నన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఆ విషయాన్ని మా తాతయ్యకి చెప్పాను. ఒళ్లు దగ్గర పెట్టుకుని నటించు అని చెప్పారు’ అని పరుచూరి సుదర్శన్ చెప్పారు.
డైరెక్టర్ రవి కిషోర్ మాట్లాడుతూ,’ఈ కథ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఓ ప్రయోగాత్మక కథ. పరుచూరి వారికి స్క్రిప్ట్ చూపించాం. చిన్న చిన్న కరెక్షన్స్ చేశారు. ఈ మూవీకి క్లైమాక్స్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది’ అని చెప్పారు.
‘పరుచూరి వారి ఇంటి నుంచి హీరోని పరిచయం చేస్తుండటం ఆనందంగా ఉంది. ఈ జనరేషన్‌కు తగ్గ కంటెంట్‌తో సినిమాను తీశాం. ఈ మూవీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని చిన్న రెడ్డయ్య అన్నారు.