రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘మిస్టర్ ఇడియట్’. ఈ చిత్రంలో సిమ్రాన్ శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. జేజేఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పీ పతాకంపై యలమంచి రాణి సమర్పణలో నిర్మాత జేజేఆర్ రవిచంద్ నిర్మిస్తున్నారు. ‘పెళ్లి సందడి’ దర్శకురాలు గౌరీ రోణంకి దీనికి డైరెక్ట్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్‌లో ఈ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ, ‘ట్రైలర్ చాలా బాగుంది. నిర్మాత రవిచంద్ నా మిత్రుడు. గతంలో ‘హ్యాష్ ట్యాగ్ బ్రో’ అనే సినిమా చేశాడు. అది ఓటీటీలో రిలీజైంది. మరో సినిమా చేయాలను కున్నప్పుడు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కథతోనే సినిమా నిర్మించాలని ప్లాన్ చేశాడు. ‘పెళ్లి సందడి’ సినిమా వంటి చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చేసిన గౌరీ దగ్గర ఉన్న స్క్రిప్ట్ నచ్చి ఈ చిత్రాన్ని ప్రారంభించాడు. ఈ సినిమాలో మాధవ్, సిమ్రాన్ పోటా పోటీగా నటించారు.సినిమా డెఫినెట్‌గా మీ అందరికీ నచ్చుతుంది’ అని అన్నారు.
‘గౌరీ వండర్ ఫుల్ డైరెక్టర్. మాధవ్, సిమ్రాన్ ఈ చిత్రంతో తెరకు పరిచయం అవుతున్నారు. వారితో పాటు మా టీమ్ అందరికీ ఈ సినిమా బిగ్ హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నా’ అని మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ చెప్పారు.
నిర్మాత జేజేఆర్ రవిచంద్ మాట్లాడుతూ, ‘డైరెక్టర్ గౌరీ రోణంకి అందరికీ నచ్చేలా మూవీ రూపొందించారు. అనూప్ ఇచ్చిన మ్యూజిక్ మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. త్వరలోనే సాంగ్స్ రిలీజ్ చేయ బోతున్నాం. సినిమాటోగ్రాఫర్ రామ్ రెడ్డి, ఎడిటర్ విప్లవ్ మా ఇతర టీమ్ అంతా మూవీకి మంచి అవుట్‌పుట్ తీసుకొచ్చారు. మాధవ్ నటనలో వారి పెదనాన్న రవితేజ ఫీచర్స్ కొన్ని వచ్చాయి. మా సినిమాలో అది చూస్తారు’ అని తెలిపారు. హీరో మాధవ్ మాట్లాడుతూ, ‘అనూప్ మ్యూజిక్, రామ్ రెడ్డి బ్యూటిఫుల్ విజువల్స్ హైలెట్ అవుతాయి. మా డైరెక్టర్ గౌరి నాకు ఒక మంచి మూవీ ఇస్తున్నారు. నిర్మాత రవిచంద్‌కి థ్యాంక్స్. మా పెదనాన్న రవితేజ నాకు ఎప్పుడూ సపోర్ట్ చేస్తుంటారు’ అని అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ మా కథను అర్థం చేసుకుని, మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఫైట్స్, డ్యాన్స్ విషయాల్లో నాకు ఎక్కువగా తెలియదు. కానీ నేను చెప్పిన సజెషన్స్ తీసుకుంటూనే వాళ్లంతా మంచి అవుట్ ఫుట్ ఇచ్చారు. ఈ మూవీ చేసే అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ రవిచంద్‌కి థ్యాంక్స్. మాధవ్, సిమ్రాన్ నటన మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ఆడియెన్స్‌కు బాగా రీచ్ అయ్యే అంశాలతో మూవీ రూపొందించాను.
– దర్శకురాలు గౌరి రోణంకి