నవతెలంగాణ – సుల్తాన్ బజార్
నిస్వార్థ సేవ భావంతో విధి నిర్వహణలో ఉత్తమంగా సేవలు అందించిన ఉద్యోగికి పదవి విరమణ పొందిన అనంతరం కూడా తాను చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి సురవరం విజయలక్ష్మి అన్నారు. శనివారం తెలంగాణ వైద్య విధాన పరిషత్ కింగ్ కోఠి జిల్లా దవఖానాలో ల్యాబ్ టెక్నీషియన్ గా 42 సంవత్సరాల 6 నెలల కాలం వీధి నిర్వహణలో ఉంది పదవి విరమణ పొందుతున్న మాదాసు శ్రీనివాసమూర్తి, శివ నాగమల్లేశ్వరి దంపతుల లను ఆమె జెడి శశి శ్రీ, దవఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్రనాథ్ లతో కలిసి శాలువా మెమొంటోతో ఘనంగా సత్కరించి వీడ్కోలుపలు కారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. చిన్న వయసులోనే ప్రభుత్వ ఉద్యోగంలో చేరి ఇటు ఉద్యోగుల సమస్యలతో పాటు, ఇతర విభాగాలలోని కార్మికులకు తాను ఉన్నానంటూ భరోసా కల్పిస్తూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం అభినందనీయంఅన్నారు. కరోనా సమయంలో ల్యాబ్ టెక్నీషియన్ గా మూర్తి సేవలు అందించడంతోపాటు ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వైద్య విధాన పరిషత్ జేఏసీ కన్వీనర్ పాండు. కోశాధికారి వీరేష్ బాబు. ఇతర నాయకులు వేణుగోపాల్. సుజాత రాథోడ్. శిరీష. ఎం.వి నరసింహారెడ్డి. షాహిదా. రామలక్ష్మి. అభిమన్యు. బోస్.భరత్ సత్యనారాయణ. ప్రొఫెసర్ లక్ష్మణ్. ఇతర విభాగాల సిబ్బంది. స్టాఫ్ నర్సులు. పారా మెడికల్ సిబ్బంది ల్యాబ్ టెక్నీషియన్లు తదితరులు పాల్గొన్నారు.