గిరిజన గ్రామానికి మట్టి రోడ్డు సౌకర్యం

గిరిజన గ్రామానికి మట్టి రోడ్డు సౌకర్యంనవతెలంగాణ-కాగజ్‌నగర్‌
కాగజ్‌నగర్‌ మండలం చిన్న మాలిని గిరిజన గ్రామానికి ఇటీవల కురిసిన వర్షాలతో రోడ్డు కోతకు గురైంది. గ్రామ సమీపంలో వాగుపై ఉన్న బ్రిడ్జి అప్రోచ్‌రోడ్డు పూర్తిగా కోతకు గురైంది. దీనితో చిన్న మాలిని, మానిక్‌పటార్‌ గ్రామాలకు సిర్పూరు (టి) మండలకేంద్రంతో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. విషయం తెలుసుకున్న సిర్పూరు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు తన పార్టీ నాయకులు, కార్యకర్తలను ఆ గ్రామానికి పంపించి రోడ్డు మరమ్మత్తులు చేయించాలని సూచించారు. దీనితో నాయకులు పాల్వాయి సుధాకర్‌రావు, నీరటి సత్యనారాయణ, అశోక్‌ ఆర్య, ఒడ్డేటి నాని, బనార్కర్‌ సాయి, దుర్గం ప్రశాంత్‌, నైతం అనిల్‌కుమార్‌లు అక్కడికి వెళ్లి జేసీబీ సహాయంతో అప్రోచ్‌రోడ్డు ఏర్పాటు చేశారు. దీనితో ఆ గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.