మండల కేంద్రంలో శుక్రవారం ఉదయం సార్గమ్మ గుడి వద్ద మట్టి కూడా కూలిపోయింది. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు బాగా నానిన మట్టి కూడా గురువారం రాత్రి మరో మారు కురిసిన వర్షానికి మట్టి గోడ కూలి రోడ్డు మీద కాలనీ లోపలికి వెళ్లే సిమెంట్ రోడ్డుపై పడింది. అయితే మట్టి గోడ వర్షానికి కూలి సిమెంట్ రోడ్డుపై పడడంతో కాలనీవాసులు ఆ రోడ్డు గుండా రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. సిమెంటు రోడ్డుపై మట్టి కూడా కూలి పడిందన్న విషయం తెలిసినప్పటికిని గ్రామ పంచాయతీ సిబ్బంది పట్టించుకోకపోవడం పట్ల కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ అధికారులు స్పందించి కూలిపడ్డ గోడ మట్టిని, ఇటుకలు శుభ్రం చేయించాలని కోరుతున్నారు.