ముదక్ పల్లిలో గడపగడపకు ప్రచారం

నవతెలంగాణ- మోపాల్
మోపాల్ మండలంలోని ముధక్ పల్లి గ్రామంలో కాంగ్రెస్ నాయకులు గడపగడపకు ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన ఆరు పతకాల గురించి కిసాన్ కీత్ జిల్లా అధ్యక్షుడు ముప్పగంగారెడ్డి  ప్రజల వివరిస్తూ డాక్టర్ భూపతిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు. మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందని వచ్చేది రైతుల ప్రభుత్వమని కచ్చితంగా రుణమాఫీ చేసి తీరుతుందని ,కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పదని, చేసేది చెప్తుందని చెప్పేది చేస్తుందని, ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలో చేసి చూపించామని మిగతా పార్టీల మాటలు నమ్మవద్దని కచ్చితంగా వచ్చేది మీ ప్రభుత్వం మన ప్రభుత్వం అని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో సాయి రెడ్డి ,బోడ మహేందర్ తదితర కాంగ్రెస్ నాయకులు ప్రజలు పాల్గొన్నారు