నవతెలంగాణ-లక్షెట్టిపేట
పట్టణంలోని ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కళాశాలలో తెలుగు విభాగం, కళా సాంస్కృతిక విభాగం, మహిళా సాధికరతా విభాగాల సంయుక్త అధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తీరొక్క రకాల పూవులను తీసుకువచ్చి మహిళా అధ్యాపకులు, విద్యార్థినులు బతుకమ్మలను తయారు చేశారు. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా చప్పట్లు కొడుతూ బతుకమ్మ పాటలు పాడి ఆటలు ఆడారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. సంతోష్ మహాత్మ మాట్లాడుతూ తెలంగాణలో బతుకమ్మ పండుగ సంప్రదాయంగా వస్తున్న ఒక గొప్ప సంస్కృతి అని కొనియాడారు. బతుకమ్మలో తెలంగాణ పల్లె జీవితం కనిపిస్తుందని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ ప్రాధాన్యత మరువలేనిది అని పేర్కొన్నారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శంకరయ్య తెలుగు విభాగం అధ్యక్షులు కల్చరల్ కోఆర్డినేటర్ డా. తన్నీరు సురేష్, ఐక్యుఏసి కో ఆర్డినేటర్ ప్రేమలత అధ్యాపకులు తిరుపతి, సంతోష్, నాగేశ్వర్, చంద్రశేఖర్ రాజ్ కుమార్, కవిత మల్లన్న సంద్యారా,ణి , స్వప్న శ్రీనివాస్, మహేశ్ కుమార్, నాగేందర్, బోధనేతర సిబ్బంది మల్లారెడ్డి, శ్రీనివాస్, శంకర్, వెంకటేష్ పాల్గొన్నారు.
ఆల్ఫోర్స్ పాఠశాలలో..
మంచిర్యాల : జిల్లా కేంద్రంలోని ఆల్ఫోర్స్ స్మార్ట్ కిడ్స్ పాఠశాలలో మంగళవారం ముందస్తు బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. రంగు రంగు పూలతో బతుకమ్మలు పేర్చి పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు. చిన్నారులు, ఆల్ఫోర్స్ విద్య సంస్థల చైర్మన్ నరేందర్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో బతుకమ్మ అనేది సంప్రదాయ పండగ అన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో విజయం, ఆనందం, ఆరోగ్యం ఎపుడు ఉండాలని కోరారు. ముందస్తు సద్ధుల బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.