పాఠశాలలో ముదస్తు సంక్రాంతి శోభ..

Mudastu Sankranti in school..నవతెలంగాణ – అశ్వారావుపేట
మండలంలోని పలు పాఠశాలలో ముందస్తు సంవ్రాంతి శోభ అలుముకున్నది. భోగిమంటలు వేసి గోబ్బిళ్లు పెట్టి రంగవల్లులతో పాఠశాల మైదానం ఆనందహేలలో మునిగిపోయింది. అశ్వారావుపేట,గుమ్మడి వల్లి జెడ్పీహౄచ్ఎస్,గాండ్లగూడెం ఎంపీపీ ఎస్ లో విద్యార్ధిని లు రకరకాల రంగరంగు ల ముగ్గులను పాఠశాల ప్రాంగణాలలో తీర్చిదిద్దారు.దీంతో ముగ్గులతో సంక్రాంతి కళ ఉట్టిపడుతుంది. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు హరిత,వీరేశ్వరరావు,శ్రీశైలం లు మాట్లాడుతూ మకర సంక్రాంతికి ఎంతో ప్రాధాన్యత ఉందని,సూర్యుడు పన్నెండు రాశుల పర్యటనలో మకరరాశిలోకి ప్రవేశించే రోజును మకర సంక్రాంతి జరుపుకుంటారని,సంక్రాంతి అంటేనే కొత్తదనానికి స్వాగతం పలికే రోజు అని అందరి జీవితాలలో కొత్తదనం నిండుకొని సంతోషాలు వెల్లివిరియాలని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్ధులకు రంగవల్లులు పోటీలు నిర్వహించి బహుమతులు అందచేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయిని,ఉపాధ్యాయులు, సి.ఆర్.,పి .ప్రభాకరాచార్యులు, విద్యార్ధులు పాల్గొన్నారు.