నవతెలంగాణ – శంకరపట్నం
శంకరపట్నం మండల కేంద్రంలో మాజీ మంత్రి స్వర్గీయ ముద్దసాని దామోదర్ రెడ్డి,68 వ జయంతి వేడుకలను టీడీపీ శంకరపట్నం మండల అధ్యక్షుడు ఎండి సయ్యద్ ఆరిఫ్ ఆధ్వర్యంలో శనివారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముద్దసాని దామోదర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నుండి కమలాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిచి మంత్రిగా ప్రజలకు ఎన్నో సేవలు అందించారని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో గోపి వీరమల్లు, గుర్రం శ్రీనివాస్ గౌడ్, గుర్రం నారాయణ, మధుకర్ లు పాల్గొన్నారు.