– ఇక్కట్లకు గురి అవుతున్న విద్యార్ధులు..
నవతెలంగాణ – అశ్వారావుపేట
నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట సెంట్రల్ లైటింగ్ పనులు నత్తనడకన సాగడంతో వాహన దారులు,విద్యార్ధులు ఇక్కట్లకు గురి అవుతున్నారు. పట్టణంలో అశ్వారావుపేట ప్రధాన కూడలి నుండి జంగారెడ్డి, సత్తుపల్లి,భూర్గంపాడు రూట్లలో 2 కి.మీ మేర రహదారి విస్తరణ,మురుగు నీటి కాలువలు,డివైడర్,సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడానికి గతేడాది తెరాస ఆధ్వర్యంలోని కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం రూ.23 కోట్ల 50 లక్షలు వ్యయం అంచనాతో ప్రారంభించింది.పాలకులు మారారు,ప్రభుత్వం మారింది,కాంట్రాక్టర్ మారాడు అయినా ఇంకా నత్తనడక నే సాగుతున్నాయి. ఇదిలా ఉండగా అశ్వారావుపేట – సత్తుపల్లి రోడ్ లో ఒక పక్క పనులు నిర్వహిస్తున్నారు.ఈ వైపు న ప్రముఖ విద్యా సంస్థ రెండు కళాశాలలు ఉన్నాయి.ఈ రెండు కళాశాలల ద్వారా లలో ఒక ద్వారం తెరిచి మరో ద్వారం వద్ద డ్రైనేజీ నిర్మిస్తున్నారు.ఈ పనులు నెలల పొడవునా నిర్వహించడంతో విద్యార్ధులను రవాణా చేసే సంస్థ వాహనాలు కు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుంది.ఒక ద్వారం ఇంతకు పూర్వం వాడింది కాకపోవడంతో బస్ లు దిగబడుతున్నాయి.అంతేగాక సిబ్బంది వాహనాలు రాకపోకలు కూడా కష్టంగా మారిందని వాపోతున్నారు.నడక మార్గంలో కళాశాలకు చేరుకునే విద్యార్ధిని విద్యార్ధులకు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేసారు. పనులు త్వరగా పూర్తి చేసి వాహనాల రాకపోకలకు మార్గం సుగమం చేయాలని,విద్యార్ధులు,వారి తల్లిదండ్రులు అధికారులను కోరుతున్నారు.