నవతెలంగాణ-వాంకిడి
మండలంలోని తమేళా గ్రామానికి వెళ్లే రోడ్డు బురదమయంగా మారడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు విస్తరంగా కురవడంతో రోడ్డు పూర్తిగా బురదగా మారుతుంది. దీనిపై రాకపోకలు సాగించే ప్రజాలు అవస్థలు పడుతున్నారు. దీనిపై ప్రజా ప్రతినిధులు, అధికారులకు విన్నవించిన పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామ సమస్యలను త్వరగా పరిష్కరించాలని గ్రామస్తుడు సెండె పాలక్‌రావు అన్నారు. చిన్నపాటి వర్షానికే రోడ్డు పూర్తిగా బురదమయంగా మారి రోడ్డు గుండా వెళ్లిలేని పరిస్థితి ఉందన్నారు. అధికారులకు, ప్రజా ప్రతినిధులకు అనేకసార్లు వినతిపత్రాలు అందజేసిన ఎవరు పట్టించుకోవడంలేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ వర్షాకాలంలోనైనా రోడ్డుకు మరమ్మత్తులు చేయించాలని కోరారు