నవతెలంగాణ – భైంసా
గత వారం రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పంట పొలాలకు వెళ్లే రహదారులు బురదమయం కావడంతో రైతులు పొలాలకు వెళ్లాలంటేనే ఇబ్బందులు పడుతున్నారు. బైంసా మండలంలోని ఇలేగాం గ్రామంలో పొలాలకు వెళ్లే రహదారి మూడు కిలోమీటర్లు పూర్తిస్థాయిలో బురదమయం కావడంతో రైతులు వెళ్లాలంటే కష్టతరమవుతుంది. గతంలో సిరాల ప్రాజెక్టు గండి పడడంతో రోడ్లన్నీ కొట్టుకుపోవడం మూలంగా ఈ పరిస్థితి తలెత్తింది. ఇకనైనా అధికారుల స్పందించి, రహదారికి మొరం వేయించాలని రైతులు కోరుతున్నారు.